సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (17:01 IST)

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో లడ్కీట్రైలర్ - రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Varma, pooja and his team
రామ్‌గోపాల్ వ‌ర్మ చైనా ఫిలిం ఒక‌టి తీశారు. తెలుగులో లో `అమ్మాయి` అనే పేరు పెట్టారు. ఇంగ్లీషులో  లడ్కీ, డ్రాగన్ గర్ల్ అనే పేరు నిర్ణ‌యించారు. పూజా బోఫీషియల్ నాయిక‌. బ్రూస్‌లీ స్పూర్తిగా ఈ సినిమా తీశాన‌ని వ‌ర్మ చెబుతున్నారు. ఇటీవ‌లే చిత్ర టీమ్‌తో చైనా ప‌ర్య‌టించారు. అందుకు సంబంధించిన ఫొటోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నేను, పూజా బోఫీషియల్, చైనా జట్టు లడ్కీ, డ్రాగన్ గర్ల్ అని పెట్టి, ఇంటర్నేషనల్ ట్రైలర్ ను నవంబర్ 28న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో జ‌ర‌పున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమా డిసెంబర్ 10న ఇండియా, చైనాలలో విడుదల కానుంది 
 
తెలుగు, తమిళ,  కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ కి అంకితం ఇస్తున్నారు.