శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (10:45 IST)

పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్‌తో దుబాయ్ వెళ్లిన సమంత, ఎందుకంటే?

సమంత ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ. ఈమె నాగచైతన్యతో విడాకులు వ్యవహారంతో వార్తల్లోకి వచ్చింది. చైతుతో విడిపోయనప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివుగా వుంటూనే దేశంలో వివిధ ప్రాంతాలను చుట్టి వస్తోంది. ఇటీవలే శిల్పరెడ్డితో కలిసి గంగోత్రి, కాశీ, బద్రీనాథ్ తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించింది.

 
ఇక తాజాగా తన స్నేహితుడు, స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిపోయింది. వీరితో పాటు తన స్నేహితురాలు సాధన కూడా వున్నారు. దుబాయ్ ట్రిప్ కేవలం క్రికెట్ మ్యాచ్ చూసేందుకే అని సమాచారం. వచ్చే ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకీ అత్యంత కీలకమైనది.