ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 అక్టోబరు 2021 (16:21 IST)

కూతురు పెళ్లి కోసం డబ్బు దాచడం కాదు, ముందు ఆ పని చేయండి: సమంత

మీ కుమార్తెను ఎవరు పెళ్లాడుతారు? అని చింతించడం మాని ఆమెను శక్తివంతంగా తీర్చిదిద్దండి. కుమార్తె పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడం మాని ఆమె చదువుపై ఖర్చు చేయండి. ఆమెని పెళ్లికి సన్నద్దం చేయడానికి బదులు ఆమెను తన కాళ్లపై తను నిలబడేలా చేయండి.
 
తనను తాను ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎటువంటి గడ్డు పరిస్థితులునైనా భయపడకుండా ఎదిరించి నిలబడేలా జీవించడం నేర్పండి అంటూ హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పోస్ట్ చేసారు. ఈ పోస్టును సమంత అక్కినేని షేర్ చేసారు.
 
కాగా అక్కినేని నాగచైతన్యతో విడిపోయాక సమంత సోషల్ మీడియాలో మరింత చురుకుగా వుంటున్నారు. అలాగే పలు కొత్త సినిమాలకు సంతకాలు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.