శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (12:24 IST)

దుబాయ్‌లో మస్తు మజా చేస్తున్న సురేఖా వాణి.. మందేస్తూ..?

సీనియర్ ఆర్టిస్ట్..సురేఖ వాణి సినిమా ప్రేక్షకులనే కాదు సోషల్ మీడియా ఫ్యాన్స్‌ను కూడా విపరీతంగా అలరిస్తుంటుంది. నిత్యం సోషల్ మీడియా‌లో యాక్టివ్‌గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ నెటిజన్లను, ఫాలోయర్స్‌ను ఆకట్టుకుంటుంది.
 
ప్రస్తుతం ఈ భామ దుబాయ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాను గడిపే ప్రతి క్షణాన్ని మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్లిన ఆమె వెంట తన కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం ఒక్కతే వెళ్ళింది. దీనికి కారణం ఏంటో మరి.
 
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో మద్యం బాటిల్ కనిపించడంతో ఆ పిక్ వైరల్‌గా మారింది. మద్యం బాటిల్‌తో తన హోటల్‌లో రిలాక్స్ అవుతూ ఉన్నట్టు కనిపించింది. ఇంత కంటే ఆనందం, ఇంత కంటే మంచి అనుభూతి ఇంకా ఎక్కడ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. 
 
మందు బాటిల్, గ్లాసు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలానే బాత్ టబ్ పక్కన.. షాంపైన్ బాటిల్‌తో సురేఖా వాణి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.