నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ చేయకపోవడానికి కారణం ఇదే
Kajal Agarwal
కానీ నాగార్జునతో ఆమె నటించడానికి ససేమిరా అంటోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఐదు రోజుల షూట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ తేలడంతో డాక్టర్ల సలహా మేరకు షూటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు రామ్మోహన్‌కు తెలియజేయడంతో ఆయన కూడా ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా వాపసు తీసుకోకుండా ఆమెను షూటింగ్ స్పాట్‌లో చిన్న పత్కారం చేశాడు. నాగార్జున ఈ విషయం తెలుసుకుని మాతృమూర్తి కాబోతున్నందుకు ఆనందంగా వుందంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పుడు ఆమె స్థానంలో మరో కథానాయికను తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించారు. త్వరలో ఎవరనేది తెలియజేయనున్నారు.
