మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (12:34 IST)

బంగార్రాజు పాట హృద‌యం చెదిరిపోయింది - నాగార్జున‌

nagarjuna twitter
అక్కినేని నాగార్జున తాజా సినిమా బంగార్రాజు. ఈ సినిమాలోని బంగార్రాజు నాకోసం- అనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డాన్ని వాయిదా వేశారు. ముందుగా అనుకున్న ప్ర‌కారం డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేయాలి. కాని వాయిదా వేస్తున్న‌ట్లు నాగార్జున ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. సీతారామ‌శాస్త్రిగారి మ‌ర‌ణం సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఇచ్చే గౌర‌వంగా భావించి వాయిదా వేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.
 
సీతారామ‌శాస్త్రిగారి క‌లం ఆగిపోయింది. పాట హృద‌యం చెదిరిపోయింది అంటూ నివాళుల‌ర్పించారు. ఆయ‌న‌కు ఇచ్చే గౌర‌వంగా భావిస్తూ రేప‌టికి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం నాగార్జున‌, చైత‌న్య ఇద్ద‌రూ మైసూర్‌లో షూటింగ్‌లో వున్నారు. ఈనెల 8వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ జ‌ర‌పున్నారు. అనంత‌రం హైద‌రాబాద్‌లో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.