గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (19:06 IST)

బిగ్ బాస్ లో పాల్గొంటే అంత డ‌బ్బు వ‌స్తుందా!

Viswa bmw
బిగ్ బాస్ షోలో పాల్గొన్న త‌ర్వాత ఒక్కొక్క‌రు న‌టులుగా చ‌లామ‌ణి అవుతున్నారు. కొంద‌రైతే బ‌య‌ట‌కు వ‌చ్చాక భారీగా కొనుగోలు చేస్తున్నారు. బిగ్ బాస్‌లో పాల్గొంటే అంత డ‌బ్బు వస్తుందా! అని చూసేవారు ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇటీవ‌లే బిగ్ బాస్‌5 సీజ‌న్‌లో పాల్గొని ఎలిమేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చాక న‌టుడు విశ్వ ప్రెస్‌మీట్ పెట్టి బిగ్ బాస్ వ‌ల్ల ఫేమ‌స్ అయ్యాయ‌నీ, ఎక్క‌డ‌లేని గుర్తింపు వ‌చ్చింద‌ని తెలిపారు. చంద్ర‌ముఖి సీరియ‌ల్ నుంచి కెరీర్ ను ప్రారంభించిన ఆయ‌న ప‌లు షోలు చేశారు.

 
అయితే తాజాగా బిగ్‌బాస్‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక బి.ఎం.డ‌బ్ల్యు. కారు కొనుగోలు చేశారు. దాన్ని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కొంద‌రు విషెస్ చెబితే. మ‌రికొంద‌రు ఇంత డ‌బ్బు వ‌స్తుందా! అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 

 
దీనిపై విశ్వ స్పందిస్తూ, నా జీవితంలోకి కొత్త కుటుంబ సభ్యుడు వ‌చ్చాడు. నా కలల కారును కొనుగోలు చేయడం వలన  జీవితానికి ఆనందాన్ని పరిపూర్ణత చేకూరింది. నా డ్రీమ్ కార్ #BMW నాతో ఉన్నందుకు నేను దేవుడికి & #BiggBossకి ధన్యవాదాలు తెలిపారు.