మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జులై 2025 (12:45 IST)

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

Gadwal
Gadwal
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడు మోజులో పడిన భార్యే ఈ హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతుడు పేరు తేజేశ్వర్. ఆయన భార్య ఐశ్వర్య. గద్వాల పట్టణంలో సుపారీ గ్యాంగ్‌తో భర్తను అంతమొందించింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించిందని కుటుంబ సభ్యులు వాపోయారు. 
 
గత నెల 17వ తేదీన తేజేశ్వర్ కనిపించకపోవడంతో తోబుట్టువులందరూ కలత చెంది కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే ఆమె ముఖంలో ఏమాత్రం బాధ కనిపించలేదని మృతుడు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇటీవల ఐశ్వర్య గదిలో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గ్లిజరిన్ సీసాను గుర్తించారు. 
 
పైగా, ఎవరికీ అనుమానం రాకుండా కన్నీళ్లు వచ్చేలా కంట్లో వేసుకుని నటించిందని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీనిపై గద్వాల సీఐ శ్రీను మాట్లాడుతూ, గ్లిజరిన్ సీసాను స్వాధీనం చేసుకుని కుటుంబీకుల ఆరోపణల కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.