శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:41 IST)

నెల రోజుల్లోపు ఆ పని చేస్తారా లేదా? సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

నెల రోజుల్లోపు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉద్యోగాలపై శ్వేతపత్రం జారీ చేయాలని టి.భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వున్నాయో తెలుపకుండా కాలయాపన చేస్తున్నారనీ, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయకపోతే భాజపా పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.

 
ఉపాధ్యాయుల రీఅలాట్మెంట్ కోసం జారీ చేసిన 317 జీవో వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థానికతకు ముప్పు ఏర్పడే ప్రమాదం వుందన్నారు. మూడు సంవత్సరాలవుతున్నా దీనిగురించి ఉద్యోగ సంఘాలతో సీఎం ఎందుకు చర్చించలేదో చెప్పాలని డిమాండ్ చేసారు.