సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (16:31 IST)

ప్రధాని మోడీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీ : ఈటల రాజేందర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశిస్తే తెరాస అధినేత సీఎం కేసీఆర్‌పై తాను పోటీ చేసేందుకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తెరాస, బీజేపీలు కలిసి పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేసారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశిస్తే, తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, తనకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య విభేదాలు ఉన్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు.