1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 డిశెంబరు 2021 (13:34 IST)

ఐరన్ మేన్ చంద్రబాబునే ఏడిపించారంటే వాళ్ల నాలుకలు కోసేయాల్సిందే: పరిటాల సునీత సంచలనం

తెలుగుదేశం నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత వైసిపి నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వైసిపి నాయకుల నాలుకలు కోసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
ఐరన్ మేన్ చంద్రబాబు గారి కళ్ల వెంట నీళ్లు తెప్పించారంటే వారి వ్యాఖ్యలు ఎంత దారుణంగా వుండివుంటాయో అర్థం చేసుకోవాలన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో గౌరవసభ- ప్రజా సమస్యలు చర్చా వేదికలో ఆమె కార్యకర్తలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు.

 
రాప్తాడు వైసిపి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన సెటిల్మెంట్లతో తీరిక లేకుండా గడుపుతున్నారనీ, ఇప్పటికే హైదరాబాదులో రూ.5 కోట్లతో ఇల్లు నిర్మించారన్నారు. అనంతపురంలోనూ కోట్లతో నిర్మాణం చేస్తున్నారనీ, ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసారు.