శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:29 IST)

కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం.. 6 సీట్లూ అధికార పార్టీకే...

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 10వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో అధికార తెరాస తరపున పోటీ చేసిన అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణలు విజయభేరీ మోగించారు. 
 
ఈ స్థానంలో మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లలేదు. మిగిలిన వాటిలో భానుప్రసాద్‌కు 584 ఓట్లువచ్చాయి. అలాగే, ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు అభర్థులు విజయభేరీ మోగించారు.
 
మరోవైపు, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు ఇప్పటికే విజయభేరీ మోగించారు. దీంతో ఎన్నికలు జరిగిన మొత్తం ఆరు స్థానాల్లో అధికార తెరాస అభ్యర్థులు గెలిచినట్టు అయింది.