బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (20:02 IST)

ఈటలను హగ్ చేసుకున్న తెరాస ఎంపి, కేసీఆర్ షాక్ తిన్నారా? (video)

తెరాస సీనియర్ నాయకుడు, ఎంపీ కె. కేశవరావు చేసిన పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తిన్నారట. సీఎం షాక్ తినే పని ఏం జరిగింది అని అనుకుంటున్నారా?

 
ఈటెలను కేకే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈటెల అంటేనే సీఎం కేసీఆర్ భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో కెకె ఇలా చేయడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇంతకీ ఈ ఆలింగనం ఎక్కడ జరిగింది అంటే... హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం జరిగింది.

 
ఈ వేడుకకు కెకె, ఈటెల హాజరయ్యారు. ఇద్దరూ ఎదురెదురు పడటంతో కేకే భాజపా ఎమ్మెల్యే ఈటెలను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇపుడిదీ హాట్ టాపిక్ అయ్యింది. తెరాసలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన ఈటెల తెరాస ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అలాంటి నాయకుడితో కేకే ఇలా వుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు.