మైనారిటీ నాయకులకు విజయవాడ ఎంపీ కేశినేని నాని గాలం!
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) తన పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయంంగా పావులు కదుపుతున్నారు. ఎంపీ కేశినేని నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నాయకులు చేరుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్, మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఖాదర్, తెలుగు దేశం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతాఉల్లాహ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు లింగమనేని శివరామ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, తిరుమలేష్, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ, పార్లమెంటు తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి బంకా నాగమణి, మాజీ కార్పొరేటర్ యెదుపాటి రామయ్య, పరిశపోగు రాజేష్, హాబీబ్, గంగాధర్, సుదర్శన్, శివశర్మ, సురభి బాలు, దూది బ్రహ్మయ్య, ఇస్మాయిల్, తాజుద్దీన్, చందక సురేష్, బూర కనకరావు, ఎర్రా రామారావు, కిరణ్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.