శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (17:12 IST)

3న మంత్రి గౌతం రెడ్డి పెద్ద కర్మ - ఏపీ మంత్రివర్గం భేటీ వాయిదా

ఈ నెల మూడో తేదీన జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వాయిదాపడింది. దీనికి కారణంగా అదే రోజున ఇటీవల హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతం రెడ్డి పెద్ద కర్మ. ఈ కారణంగా 3వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ నెల 7వ తేదీన అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 
 
కాగా, గత నెల 21వ తేదీన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. దుబాయ్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఆయన ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందారు. ఈయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులంతా పాల్గొన్న విషయంతెల్సిందే.