బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (15:15 IST)

ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం - 9 బస్సులు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9కి పైగా బస్సులు దగ్ధమైపోయాయి. జిల్లా కేంద్రంలోని ఉడ్ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెర్స్ బస్ పార్కింగ్ స్టాండులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలువైపులా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొలుత తొమ్మిది బస్సులు కాలిపోయాయి. ఆ తర్వాత మరో రెండు బస్సులకు మంటలు అంటుకున్నాయి.
 
ఈ మంటలు మరింతగా వ్యాపించి పార్కింగ్‌ ఏరియాలో ఉన్న మరో 20 బస్సులకు అంటుకునేలోపు అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల ఆస్తికి నష్టం ఏర్పడింది. అంతేకాకుండా, పార్కింగ్ ఏరియాలో ఉన్న బస్సులను మరోప్రాంతానికి తరలించారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.