శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (10:41 IST)

ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్ : ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యానికి క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని నిర్మయిచింది. అలాగే, గత మూడేళ్లుగా ఒక్క డిస్టిలరీ కంపెనీకి కొత్తగా అనుమతి ఇవ్వలేదని అంటోంది. ఈ విషయాన్ని స్పెషల్ సీఎస్ రంజిత్ భార్గవ్ వెల్లడించారు. 
 
రాష్ట్రంలో చివరి డిస్టిలరీ పర్మిషన్ గత 2019 ఫిబ్రవరిలో ఇచ్చారని గుర్తుచేసింది. ఆ తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే దేశంలో మరెక్కడాలేని విధంగా మద్యం క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. గత 2014 నుంచి 2018 మధ్య యేడాదికి 99 వేల శాంపిల్స్ టెస్టులు చేసినట్టు పేర్కొంది.