ఫిక్కీ చెన్నై చాప్టర్ ఛైర్‌పర్సన్‌గా ప్రసన్న వాసనాడు
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్.సి.సి.ఐ) చెన్నై చాప్టర్‌కు ఛైర్ పర్సన్‌గా ప్రసన్న వాసనాడు నియమితులయ్యారు. ఈమెకు బాధ్యతలు అప్పగించే కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో చేంజ్ ఆఫ్ గార్డ్‌ను ఔట్ గోయింగ్ ఛైర్‌పర్సన్ జయశ్రీ రవి అందజేశారు. ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నైలోని బ్రిటీష్ హైకమిషనర్ ఆలివర్ బాల్‌హట్‌చెట్, ఫిక్కీ చెన్నై ఛైర్మన్ జీఎస్కే వేలు, ఇన్‌కమింగ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధా శివకుమార్‌లు పాల్గొన్నారు.
2022-23 సంవత్సరానికి ఇన్‌కమింగ్ ఛైర్‌పర్సన్, విడెర్మా సహ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్, టికిటారో వ్యవస్థాపకురాలు ప్రసన్న వాసనాడుకు ఔట్ గోయింగ్ ఛైర్‌పర్సన్, పాలమ్ సిల్క్స్ వ్యవస్థాపకురాలు జయశ్రీ చేంజ్ ఆఫ్ గార్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్వో చెన్నై చాప్టర్ సభ్యులతో ఫార్మల్ ఫైనల్ ఈవెంట్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్ కార్యక్రమాలు నిర్వహించారు.