బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (09:50 IST)

పసిడి ధరలు పైపైకి.. పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు

పసిడి ప్రియులకు షాక్. దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,400 రూపాయలుగా ఉంది.
 
24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 51,700 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా బాగానే పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,600 రూపాయలుగా ఉంది.
 
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు పెరగడం ప్రారంభించాయి.
 
తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ ధర రూ.95.49గా ఉంది. 
petrol
 
మరోవైపు ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.80, డీజిల్ రూ.96.83గా నమోదైంది.
 
గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21, డీజిల్ ధర రూ.97.26గా ఉంది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.