సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (10:48 IST)

పెరిగిన బంగారం వెండి ధరలు

బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. భారతీయ మార్కెట్‌లో కూడా ధరలు పెరిగాయి.
 
ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.48,010కు చేరింది. 
 
అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 పెరుగుదలతో రూ.44,010కు పెరిగింది. ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. వెండి ధరలో కేజీకి రూ.300 పెరుగుదలతో రూ.73,700కు చేరింది.