ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (11:35 IST)

వుమెన్స్ డే.. మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి

అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున మహిళలకు భారీ షాక్ తప్పలేదు. బంగారం, వెండి ఆభరణాలు ఏమైనా కొందామని అనుకున్న మగువలకు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 
 
హైదరాబాద్ నగరంలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 1000 పెరిగి రూ. 49,400కు చేరింది. 
 
అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1090 పెరిగి రూ. 53,890 కు చేరింది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 2300 పెరిగి రూ. 75,700కు చేరుకుంది.
 
అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890గా ఉంది.