బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated: మంగళవారం, 8 మార్చి 2022 (10:49 IST)

నేడు వనపర్తిలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మంగళవారం వనపర్తిలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో "మన ఊరు - మన బడి" కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. 
 
అలాగే, జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని, నూతనంగా నిర్మించిన తెరాస పార్టీ జిల్లా కార్యాలయాలకు కూడా సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 
 
వనపర్తిలో కన్నెతండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం, వ్యవసాయ మార్కెట్‌ యార్డును కూడా సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. 
 
సీఎం కేసీఆర్ సభకు టీఆర్‌ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో వీధులన్నీ పార్టీ జెండాలతో గులాబీమయమయ్యాయి. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బద్రతను కల్పించారు. అలాగే, బహిరంగ సభ కోసం భారీగా జనసమీకరణ చేపట్టారు.