శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (15:57 IST)

శ్రీవారి భక్తులకు IRCTC గుడ్‌న్యూస్

దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో తిరుపతి దేవస్థానం పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తేనుంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. 
 
వీకెండ్‌లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. తాజాగా ఢిల్లీలో ఉన్న శ్రీవారి భక్తుల కోసం మరో ప్యాకేజీ ప్రకటించింది. 
 
ఈ ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నై చేరుకుంటారు. 
 
అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్లే మార్గంలోనే శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి చేరుకున్నాక హోటల్‌ గది కేటాయిస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
 
రెండో రోజు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. అనంతరం చెన్నై విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంటుంది.