శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:20 IST)

ఆశావర్కర్లకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్

ఆశావర్కర్లకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గౌరవ వేతనం పెంపుపై కీలక ప్రకటన చేసింది. ఎన్ సిడిసి సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం కోరింది. 
 
గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంపు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు తదితర అంశాలపై మరోమారు ఏపీ ప్రభుత్వంతో చర్చ జరుపనున్నారు.
 
వీటిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వం. రంపచోడవరంలో అధిక ఇంజెక్షన్ డోస్ కారణంగా గర్భిణీ ఆశా వర్కర్ మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.