25 సీఎం కేసీఆర్ హస్తిన పర్యటన - ఎందుకో తెలుసా?
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే పోరులో భాగంగా ఆయన విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇటీవల ముంబైకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.
నిజానికి సీఎం కేసీఆర్ గురువారమే ఢిల్లీకి వెళ్లాల్సివుంది. అయితే, కొన్ని కారణాల రీత్యా ఆయన తన పర్యటనను శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. 25వ తేదీన తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్, పలువురు నేతతో కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారని సీఎం వర్గాలు వెల్లడించాయి. అయితే, ఢిల్లీ పర్యటనలో ఆయన ఎవరెవరితో సమావేశమవుతారో తెలియాల్సివుంది.