గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (19:06 IST)

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌తో సీఎం కేసీఆర్ - ప్రత్యేక ఆకర్షణగా ప్రకాష్ రాజ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన బీజేపీయేతర విపక్ష నేతలతో వరుసగా భాటీ కావాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా, ఆదివారం ప్రత్యేకంగా ముంబైకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ప్రత్యేకంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉండటం గమనార్హం. 
 
ఈ భేటీ ఠాక్రే అధికారిక నివాసమైన వర్ష బంగ్లాలో జరిగింది. దాదాపు 2 గంటల పాటు భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ప్రకాష్ రాజ్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత రాత్రికి ఆయన ముంబైకు చేరుకోనున్నారు. సీఎంతో పాటు.. ముంబైకు వెళ్లిన బృందంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.