మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (14:17 IST)

రూ.200 కోసం తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. రూ.200 కోసం కన్నతల్లిని కిరాతక కొడుకు హత్య చేశాడు. మద్యాన్ని కొనుగోలు చేసేందుకు రూ.200 అడగ్గా, తల్లి నిరాకరించింది. దీంతో ఆగ్రహించి తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడని సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగారాం వెల్లడించారు.
 
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఈ ఓ వితంతువు, దినసరి కూలీ అయిన తల్లి సత్తెమ్మ (65) అనే మహిళకు చంద్రశేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిస అయిన ఈయన.. నిత్యం డబ్బుకోసం తల్లిని వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో శనివారం తల్లిని రూ.200 ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దంతో ఆగ్రహించిన చంద్రశేఖర్... గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సత్తెమ్మ కన్నుమూసింది. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.