1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Fake Certificates in Osmania University

ఉస్మానియా యూనివర్శిటీలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం

Osmania University
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం చెలరేగింది. తెలంగాణ రాష్ట్రంలోనేకాకుండా దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇపుడు ఈ వర్శిటీలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం చెలరేగింది. ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఓయూ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ వర్శిటీకి చెందిన నకిలీ సర్టిఫికేట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్ అడ్డాగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుతో సహా తగిన ఆధారాలను వారు సీపీకి అందజేశారు. పైగా, ఇలా ఎంతో మంది నకిలీ సర్టిఫికేట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఉన్నతాధికారులు కచ్చితంగా సచివాలయానికి రావాల్సిందే