మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (16:14 IST)

మద్యంమత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

సిద్ధిపేట జిల్లాలో దారుణం జరింది. మద్యం మత్తులో ఓ తాగుబోతు కట్టుకున్న భార్యను హతమార్చాడు. అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండా గ్రామపంచాయతీ పరిధిలోని తారాచంద్‌ తండాలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పంతులు తండాగు చెందిన జాటోతు మణెమ్మ(40)ను భర్త స్వామి అనుమానిస్తూ తరచూ గొడవలు పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పలుమార్లు గ్రామ పెద్దలు పంచాయతీ చేసి సర్ది చెప్పారు. అయితే, బుధవారం సమ్మక్క సారక్క పండుగ చేసుకున్న తర్వాత రాత్రి ఆస్తిలో సగం మొదటి భార్య కుమార్తెకు రాసిస్తానని అనడంతో భార్య భర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. 
 
తాగిన మైకంలో ఉన్న స్వామి భార్యను కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భార్య మృతదేహాన్ని భర్త స్వామి ట్రాక్టర్‌లో అక్కన్నపేట మండల కేంద్రానికి తీసుకువచ్చి పెట్రోల్‌ బంక్‌, ప్రభుత్వ ఆసుపత్రి మధ్యన రోడ్డు పక్కన పడేసి వెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.