గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:10 IST)

అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఆయనో మూర్ఖుడు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తాజాగా అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు. 
 
సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే.. తండ్రి ఎవరని అడుగుతారా? సీఎం నీచమైన కామెంట్స్ చేసినా.. రాహుల్ గాంధీ మాత్రం ఏ మాట అనలేదని మహిళా కాంగ్రెస్ నేతలు అన్నారు.
 
హేమంత బిశ్వ శర్మ  సీఎం పీఠంపై కూర్చున్న మూర్ఖుడని టి.కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పుకొచ్చారు.  అతడిని సీఎం పీఠం నుంచి తప్పించాలన్నారు. 
 
ఈ మేరకు మహిళా కమిషన్‌ను కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి అస్సాం సీఎంపై ఫిర్యాదు చేశారు. మహిళలు అంటే బీజేపీకి గౌరవం లేదన్నారు గీతారెడ్డి. ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే అసోం సీఎం పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.