మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:31 IST)

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిమంత్‌పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒకవేళ కేసు నమోదు చేయకుంటే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ముట్టడించి ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని ముందస్తుగా గురువారం అరెస్టు చేశారు. ఆయన్ను నివాసం ముందు పోలీసులు బారికేడ్లు పెట్టి భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో పాటు టీ పీసీసీ నిరసనలకు పిలుపునివ్వడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.