సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (10:05 IST)

ఉద్యోగం పేరుతో ఎర.. ఆపై వ్యభిచార కూపంలోకి..

హైదరాబాద్ నగరంలో అనేకమంది యువతులు మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తామని పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. తాజాగా నగరంలోని శివాజీ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న పక్క సమాచారంతో జవహర్ నగర్ పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు మహిళలతో పాటు.. ఆరుగురుని అరెస్టు చేశారు. ముగ్గుర మహిళలను స్టేట్ హోంకు తరలించారు. 
 
తమకు వచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన బృందం శివాజీనగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆటోడ్రైవర్ బాలాపురం ప్రసాద్ (32)ను అదుపులోకి తీసుకుంది. అతనితో పాటు జ్యోతి, సాయి కిషోర్, సూర్యవంశీ, భవాని, భాగ్యలక్ష్మిలు ఉద్యోగాల సాకుతో పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపుతున్నారని పోలీసులు తెలిపారు. 
 
ఒక్కో కస్టమర్ నుంచి రూ.2,000 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.