వైఎస్.షర్మిల అరెస్టు - స్టేషన్‌కు తరలింపు
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి.జనార్థన్ రెడ్డికి ఆమె వినతి పత్రం సమర్పించారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన షర్మిల పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.