పాలిటెక్నిక్ పేపర్ లీక్ కేసులో నలుగురి అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకేజీ స్వాతి కాలేజ్ నుంచి లీకైనట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు.
వీరిలో ముగ్గురు కాలేజీ సిబ్బందితో పాటు ఒక పరిశీలకుడు ఉన్నారని పోలీసులు వెల్లిడించారు. అయితే, పరీక్షకు అరగంట ముందు మాత్రమే ప్రశ్నపత్రం లీక్ చేశారని, స్వాతి కాలేజీ నుంచి ఈ లీక్ కూడా జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్వాతి కాలేజీ నుంచి గత యేడాది అడ్మిషన్స్ తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.
దీంతో విద్యార్థులను అధిక సంఖ్యలో పాస్ చేయించి, కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ పెంచుకునేందుకు కాలేజీ యాజమాన్యం ప్లాన్ చేసింది. ఇందులోభాగంగానే, పరీక్షకు అరగంటకు ముందు ఈ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసింది. వాట్సాప్‌లో కొందరు విద్యార్థులకు షేర్ చేయగా, వారి నుంచి మరికొంతమంది విద్యార్థులకు ఈ ప్రశ్నపత్రం చేసింది