మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (16:31 IST)

ప్రేమికుల డే స్పెషల్ ... 14న 'కళావతి' పాట విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నిర్మించిన చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం ఫస్ట్  సింగిల్‌ను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ పాట విడుదలకు ముందే లీక్ అయింది. దీనిపై చిత్ర యూనిటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ పాట లీకేజీ వ్యవహరంలో ఇద్దరిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కళావతి సాంగ్‌ను సిధ్ శ్రీరామ్ ఆలపించగా థమన్ సంగీతం సమకూర్చారు. తమన్ ఈ సంగ్ విడుదలపై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే విడుదలైన "కళావతి" పాట ప్రోమో ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే.