గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (15:53 IST)

రేవంత్ రెడ్డికి పిండప్రదానం.. ఎందుకో తెలుసా?

పీసీసీ రేవంత్ రెడ్డికి పిండప్రదానం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. 
 
రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని అన్నారు. 
 
ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదలకు సేవా కార్యక్రమాలు చేయమని, భావితరాలకు భరోసానిచ్చే మొక్కలు నాటే కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే చంద్రబాబు పెంపుడు కుక్క దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.