మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు ముంబైకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముంబైకు బయలుదేరివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. 
 
కేసీఆర్‌తో పాటు ఆయన వెళ్లే బృందానికి ఉద్ధవ్ ఠాక్రే మధ్యాహ్న భోజన విందు ఇస్తారు. భోజనం, చర్చల అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ నివాసానికి చేరుకుని, ఆయనతో చర్చిస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ముంబై పర్యటన ముగించుకుని సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు.