శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (09:52 IST)

సీఎం కేసీఆర్ వస్తారో రారో ఎదురుచూద్దాం: చిన్నజీయర్ స్వామి

ఫోటో కర్టెసీ-చిన్నజీయర్ ఆర్గ్
సమతా మూర్తి విగ్రహావిష్కరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఆరోగ్యరీత్యా ప్రధాని మోదీని స్వాగతించేందుకు కూడా రాలేకపోతున్నట్లు చెప్పారు. ఆ సంగతి అలా వుంటే.. సమతామూర్తి విగ్రహావిష్కరణ జరిగినప్పటికీ అటువైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తొంగిచూడలేదు. దీనితో చిన్నజీయర్ స్వామికి కేసీఆర్‌కి మధ్య విభేదాలున్నట్లు ప్రచారం మొదలైంది.

 
ఈ ప్రచారంపై జీయర్ స్వామి స్పందిస్తూ... తమకు ఎవరితోనూ విభేదాలు వుండవన్నారు. తమకు అందరూ సమానమేనని చెప్పారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ తదనంతర కార్యక్రమాలు విజయవంతం కావడానికి కేసీఆర్ గారే ముఖ్య కారణమని తెలిపారు. ఆయన ఇప్పటివరకూ ఇక్కడికి రాకపోవడానికి వేర్వేరు కారణాలు వుండివుండవచ్చన్నారు. తనకు, కేసీఆర్ గారితో ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పారు. రాజకీయాల్లో స్వపక్షం, విపక్షం వుంటుందని.. తమ దగ్గర కాదని చెప్పారు.

 
కాగా ఈరోజు ముచ్చింతల్‌లో జరుగనున్న శాంతి కళ్యాణానికి కేసీఆర్ వస్తారో రారోనని చిన్నజీయర్ స్వామి అన్నారు. ఆయనను ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తామని తమతో చెప్పినట్లు గుర్తు చేసారు.