శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (09:48 IST)

తెలంగాణలో త్వరలోనే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో త్వరలోనే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి.  తద్వారా పోస్టు పెయిడ్ విధానం నుంచి ప్రీపెయిడ్‌గా మారనుంది. దశల వారీగా ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  
 
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటి వరకు 22 వేల ప్రీపెయిడ్ మీటర్లను మాత్రమే బిగించారు. అయితే, ప్రీపెయిడ్‌తోపాటు సాధారణ రీడింగ్ కూడా తీస్తుండడంతో వినియోగదారులు రెండో దానినే ఎంచుకుంటున్నారు. 
 
దీంతో ప్రీపెయిడ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు, కొత్త ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు విద్యుత్ టారిఫ్‌లో రాయితీలు ఇవ్వాలని డిస్కంలు భావిస్తున్నాయి.