1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Minister Harish Rao tour in Warrangal District

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మంత్రి హరిష్ రావు టూర్

Minister
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ముఖ్యంగా ములుగులో మంత్రి హరీశ్‌‌‌‌రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా 18 ఏళ్లు నిండిన 7లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. 
 
పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో వచ్చే సాధకబాధకాలను గుర్తించి, మార్పులు చేర్పుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టనున్నారు. మరోవైపు మంత్రుల పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల ఆఫీసర్లు పూర్తి చేశారు. 
 
ములుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చడమే కాకుండా రేడియాలజీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ భవన నిర్మాణాలకు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు శంకుస్థాపన చేస్తారు. పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తర్వాత నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడులు