సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (11:33 IST)

పాముకాటుకి గురైన విద్యార్ధి ఫ్యామిలీకి సాయం

మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్థులు పాముకాటుకు గురైన ఘటన‌పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక సాయం ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. 
 
మంత్రుల ద్వారా ఈరోజు విద్యార్ధి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. దీంతో విద్యార్ధి కుటుంబానికి ఊరట లభించనుంది. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 
మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.