గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (16:16 IST)

ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్రం చర్యలు భేష్ : సీజేఐ రమణ

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కున్న భారతీయ విద్యార్థులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే రమణ ప్రశంసించారు. ప్రస్తుతం కేంద్రం మంచి చర్యలే చేపడుతోందని, వాటిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనని స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని కొనియాడారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకు తెలుసన్నారు. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కున్న పౌరులను త్వరగా తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఏ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.