1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 మార్చి 2022 (13:16 IST)

త్వరగా వెళ్లిపొండి, మేమేమైనా ఫర్వాలేదు మీరు సురక్షితంగా వుండాలి: ఇండియన్ విద్యార్థులతో ఉక్రెయిన్లు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ రాజధాని నగరంపై రష్యా సైనిక దళాలు బాంబుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. రాజధానిని ఆక్రమించడమే లక్ష్యంగా సేనలు ముందుకు వెళ్తున్నాయి. ఒకవైపు ఎముకలు కొరికే మంచు, మరోవైపు ప్రాణాలు తీస్తున్న రష్యా సేనల మధ్య ఉక్రెయిన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 
మరోవైపు విదేశీ చదువుల కోసం తమ దేశానికి వచ్చిన భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్లు జాగ్రత్తగా పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాము ఏమయినా ఫర్వాలేదనీ, మీరు మాత్రం మీ స్వదేశానికి సురక్షితంగా వెళ్లాలంటూ వారు భారతీయ విద్యార్థులను సాగనంపుతున్నారు. కాగా ఉక్రెయిన్ కీవ్ రాజధాని నగరం నుంచి భారతీయ విద్యార్థులు పూర్తిగా ఖాళీ చేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రాణమున్నంతవరకూ పోరాడుతాం: ప్రపంచాన్ని కదిలించిన ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెనెన్ స్కీ అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన అంతర్జాతీయ మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ముఖ్యంగా, తమ దేశ ప్రజల మనోభావాలు రష్యా వాళ్లకు తెలియవన్నారు. రష్యా సైనికులు తమను చంపడానికి లేదా వాళ్లు చావడానికే ఉక్రెయిన్‌పై దండయాత్రకు వస్తున్నారని ఆయనన్నారు.

తాజాగా సీఎన్ఎన్, రాయిటర్స్ వార్తా సంస్థలకు సంయుక్తంగా జెలెన్ స్కీని ఇంటర్వ్యూ చేశాయి. ఇందులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో తాము యుద్ధాన్ని నిలువరించే పరిస్థితుల్లో లేమన్నారు. పోరాటమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. తుదికంటూ పోరాడుతామని తేల్చి చెప్పారు.

 
"ఇది మా ఇల్లు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా పిల్లల భవిష్యత్ కోసం మా భూమిని, మా ఇంటిని మేం కాపాడుకుని తీరుతాం" అని గద్గద స్వరంతో ఆయన చెప్పుకొచ్చారు. జీవించే హక్కును తాము కాపాడుకుంటామని చెప్పారు. రష్యా వాళ్లకు తమ ప్రజల మనస్తత్వం, తమ దేశం, తమ సిద్ధాంతాలు అర్థం కాబోవన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి వాళ్లకేం తెలియదని అన్నారు. వాళ్లు తమను చంపడానికి లేదంటే వాళ్లు చావడానికే ఉక్రెయిన్‌పై దండయాత్రకు వస్తున్నారని అన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆవేదనకు లోను చేస్తున్నాయి.