మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (19:04 IST)

ఉక్రెయిన్‌లో 423 మంది తెలుగు విద్యార్థులు : కార్యదర్శి కృష్ణబాబు

ఉక్రెయిన్‌లో 423 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకునివున్నారని ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈయన సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఈ విద్యార్థులందరినీ మ్యాపింగ్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఏడు విశ్వవిద్యాలయాల్లో అనేక మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. 
 
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నదీ మ్యాపింగ్ చేశామన్నారు. మ్యాపింగ్ చేసిన వాళ్ళతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. 
 
ఇందులో 23 మంది విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చిందన్నారు. అయితే, వీరిలో ఏపీకి చెందిన వారు కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అదేసమయంలో ఢిళ్లీ ఎయిర్‌పోర్టులో ఏపీ భవన్ తరపున హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు.