బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (09:13 IST)

ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి 22 మంది విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది విద్యార్థులు శనివారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో ఈ 22 మంది బుకారెస్ట్ నుంచి మూడు ప్రత్యేక విమానాల్లో వీరంతా ఢిల్లీ, ముంబై చేరుకుంటారని రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ ఎ.బాబు తెలిపారు. 
 
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. అధికారాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలను డ్రగ్స్ బానిసలు, ఉగ్రవాదులు, నియో నాజీలుగా అభివర్ణించారు.