శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (08:00 IST)

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమానం - 420 రాక

ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న మరో 420 మంది భారత విద్యార్థులు సురక్షితంగా మాతృదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్‌లో గంగలో భాగమైన భారత వాయుసేనకు చెదిన రెండు సీ 17 విమానాలు 420 మందితో ఢిల్లీకి చేరాయి. 
 
రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 220 మంది భారతీయలతో మరో సీ17 విమానం ఢిల్లీలోని హిండన్ హెయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. 
 
స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. కాగా మరో 300 మందితో కూడిన మూడు సీ 17 విమానాలు గురువారం ఉదంయ ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని ఆపరేషన్ గంగా అధికారులు వెల్లడించారు.