సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (15:29 IST)

కామారెడ్డిలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. 
 
ఈ స్కూలుకు చెందిన శిరీష్ (17) అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలోని మంచినీటి ట్యాంకులలో పడి ప్రాణాలు విడిచింది. మృతురాలిని నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్ గ్రామవాసిగా తెలిపింది. అయితే, శిరీషది ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.