మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (11:50 IST)

గురుకుల పాఠశాల విద్యార్థులను కాటేసిన పాము

ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో ఉన్న జ్యోతిరావ్ పూలో బీసీ గురుకుల పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. ఈ పాఠశాలకు చెందిన అనుబంధ వసతి గృహంలో ఉండే విద్యార్థులను కాటేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పాము కరిచింది. దీంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
దీంతో వెంటనే విద్యార్థులను స్థానికంగా ఉండే తిరుమల ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, రంజిత్ కుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, పాము కాటుకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. ముఖ్యంగా, రంజిత్ కుమార్ అనే విద్యార్థి తల్లిదండ్రులు విలపిస్తున్నారు.