సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (14:37 IST)

తెలంగాణ విద్యార్థుల్లో టెన్షన్.. టెన్షన్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆన్‌లైన్ విద్యాబోధన జరిగింది. పైగా, సిలబస్ కూడా సక్రమంగా పూర్తికాలేదు. దీనికితోడు మే నెల 11వ తేదీ నుంచి వార్షిక పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇది విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. సక్రమంగా విద్యాబోధన జరగకపోవడంతో పరీక్షలు ఏ విధంగా రాయాలన్న విద్యార్థుల్లో స్పష్టంగా నెలకొంది. 
 
తెలంగాణా రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలు గత 2018-19 విద్యా సంవత్సరంలో జరిగాయి. ఆ తర్వాత రెండు బ్యాచ్‌లను పబ్లిక్ పరీక్షలు లేకుండానే పాస్ చేయించారు. అయితే, ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజానికి సిలబస్ విద్యాబోధన జనవరి 10వ తేదీలోపు పూర్తిచేయాల్సివుంది. కానీ, అది సాధ్యపడలేదు.