1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Snake in mahaboobnagar

మహబూబ్‌నగర్‌లో నాగుపాము..

Snake
నాగుపాము మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. చెట్టుపై బుసలు కొడుతూ.. పడగవిప్పి రెండు గంటలకు పైగా చెట్టుపైనే వుంది. దీంతో పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఖాళీ స్థలంలో కొంతమంది రైతులు మిరపకాయలు ఎండబెట్టారు. ఆ సమయంలో అక్కడ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.
 
కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెట్టుపై నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. దీంతో ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు.. మార్చి 4 నుంచి ఆ జిల్లాలకు అలెర్ట్